Huzurnagar: కుష్ఠు అనుమానిత మచ్చల సర్వేకు ప్రజలు సహకరించాలి సురేష్ బాబు
Huzurnagar: తెలంగాణ ప్రభుత్వ కుష్ఠు అనుమానిత మచ్చల సర్వేకు ప్రజలు సహకరించాలి. హుజూర్ నగర్‌లో సర్వేను పరిశీలించిన డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్ సురేష్ బాబు.
Huzurnagar: కుష్ఠు అనుమానిత మచ్చల సర్వేకు ప్రజలు సహకరించాలి సురేష్ బాబు
హుజూర్‌నగర్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 22 నుండి నవంబర్ 4 వరకు నిర్వహించు కుష్టు అనుమానిత మచ్చల సర్వేకు ప్రజలంతా సహకరించాలని డిప్యూటీ పారామెడికల్ అధికారి మాతంగి సురేష్ బాబు కోరారు.
ఈరోజు హుజూర్నగర్ లోని సుందరయ్య నగర్ కాలనీలో సర్వేను పర్యవేక్షించి మాట్లాడుతూ శరీరంపై స్పర్శ లేని తెల్లని లేదా ఎరుపు మచ్చలు, కాళ్లు చేతుల్లో తిమ్మిర్లు మరియు మొద్దు బారి ఉండడం వంటి లక్షణాలు
కలిగినట్లయితే వెంటనే మీ ఇంటి వద్దకు వచ్చే ఆశా కార్యకర్తకు లేదా ఆరోగ్య సిబ్బందికి తెలియపరచాలని కుష్టు వ్యాధిని గూర్చి భయపడవద్దని స్వల్ప చికిత్స ద్వారా నయం చేసుకోవచ్చని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ పద్మ, లెప్రసీ, టీబి నోడల్ అధికారి ఇందిరాల రామకృష్ణ, ఆశా కార్యకర్తలు మాలతి, వినోద పాల్గొన్నారు.




