Huzurnagar: భూ అక్రమాలపై కఠిన చర్యలు ముగ్గురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్!

Huzurnagar: హుజూర్‌నగర్‌లో భూ అక్రమాలు, విధుల నిర్లక్ష్యంపై తహసీల్దార్ కవిత, ఆర్‌ఐ కాశీం షరీఫ్, జీపీవో జానీ పాషాలను సస్పెండ్ చేసిన కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్.

DONTHAGANI RAJA RAMESH, HUZUR NAGAR
Published on: 23 Oct 2026 9:32 PM IST
Huzurnagar
X

Huzurnagar: భూ అక్రమాలపై కఠిన చర్యలు ముగ్గురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్!

హుజూర్‌నగర్‌: భూ లావాదేవీల్లో అవకతవకలు, విధుల నిర్వహణలో నిర్లక్ష్యంపై జిల్లా కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ కఠిన చర్యలు తీసుకున్నారు. హుజూర్‌నగర్‌ తహసీల్దార్‌ బి. కవిత, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ కాశీం షరీఫ్‌, జీపీవో ఎస్‌.కె. జానీ పాషాలను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

రికార్డుల పరిశీలనలో నిర్లక్ష్యం

హుజూర్‌నగర్‌ పరిధిలోని సర్వే నంబర్లు 458, 281లో భూ లావాదేవీలపై ప్రాథమిక విచారణలో అవకతవకలు వెలుగుచూశాయి. పాత రెవెన్యూ రికార్డులు, కోర్టు ఉత్తర్వులను పూర్తిస్థాయిలో పరిశీలించకుండానే లావాదేవీలు జరిపినట్లు గుర్తించారు. శాఖాపరమైన విచారణ పెండింగ్‌లో ఉండగానే ఈ చర్యలు చేపట్టారు.

DONTHAGANI RAJA RAMESH, HUZUR NAGAR

DONTHAGANI RAJA RAMESH, HUZUR NAGAR