Huzurnagar: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన రిక్షా కార్మికుడి కుటుంబానికి ఆర్థిక సాయం

Huzurnagar: హుజూర్ నగర్‌లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన రిక్షా కార్మికుడు రమణయ్య కుటుంబానికి మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్ తక్షణ ఆర్థిక సాయం.

DONTHAGANI RAJA RAMESH, HUZUR NAGAR
Published on: 23 Oct 2026 4:21 PM IST
Huzurnagar
X

Huzurnagar: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన రిక్షా కార్మికుడి కుటుంబానికి ఆర్థిక సాయం

హుజూర్ నగర్: మున్సిపాలిటీ పరిధిలోని 20వ వార్డుకు చెందిన రిక్షా కార్మికుడు పిల్లుట్ల రమణయ్య ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం జరిగింది. ఈరోజు ఆయన కుటుంబ సభ్యులను హుజూర్ నగర్ మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్ పరామర్శించారు.

ఈ సందర్భంగా మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి, వారి కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం అందజేశారు.

ఈ కష్ట సమయంలో మృతుని కుటుంబ సభ్యులను ధైర్యంగా ఉండాలని కోరుతూ భవిష్యత్తులోనూ వారి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

కుటుంబ పెద్దను కోల్పోయిన బాధాకర సమయంలో బాధిత కుటుంబానికి అండగా నిలవడం ద్వారా మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. ఈకార్యక్రమంలో దొంతగాని జగన్. మధు. అసిఫ్ తదితరులు జరిగింది.

DONTHAGANI RAJA RAMESH, HUZUR NAGAR

DONTHAGANI RAJA RAMESH, HUZUR NAGAR