Huzurnagar: హైదరాబాద్ మహా ధర్నాకు హుజూర్నగర్ భవన నిర్మాణ కార్మికులు
Huzurnagar: భవన నిర్మాణ సంక్షేమ నిధుల విడుదల, రూ.9 వేల పెన్షన్ డిమాండ్‌తో హైదరాబాద్‌లో జరిగే మహా ధర్నాకు హుజూర్నగర్ నుంచి కార్మికులు భారీగా తరలివెళ్లారు.
Huzurnagar: హైదరాబాద్ మహా ధర్నాకు హుజూర్నగర్ భవన నిర్మాణ కార్మికులు
హుజూర్నగర్: భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న మహా ధర్నాలో పాల్గొనేందుకు హుజూర్నగర్ నుంచి కార్మికులు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. సీఐటీయూ జెండాలతో ఉత్సాహంగా బయలుదేరారు.
ఈ సందర్భంగా శిల్పకళా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి యల్క సోమయ్య గౌడ్ మాట్లాడుతూ, సంక్షేమ బోర్డు నిధులను కార్మికుల సంక్షేమానికే వినియోగించాలని, పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని, వివిధ సంక్షేమ పథకాల సహాయాన్ని పెంచాలని, 60 ఏళ్లు నిండిన కార్మికులకు నెలకు రూ.9,000 పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కార్మికుల హక్కుల సాధన కోసం డిసెంబర్ 1, 2, 3 తేదీల్లో ఢిల్లీలో జరిగే ధర్నాలోనూ పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కంచుపాటి రాంబాబు, ములకలపల్లి పద్మ, షేక్ అక్బర్, రామకృష్ణ, వేణు, రమణ, వెంకటమ్మ, సైదులు, కోటేశ్వరరావు, ప్రభాకర్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.




