Huzurnagar: పట్టభద్రుల ఎమ్మెల్సీ సన్నాహక భేటీని జయప్రదం చేయాలి!
Huzurnagar: హుజూర్‌నగర్‌లో రేపు జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశానికి మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి హాజరుకానున్నారు. విజయవంతం చేయాలని నగేష్ రాథోడ్ పిలుపునిచ్చారు.
Huzurnagar: పట్టభద్రుల ఎమ్మెల్సీ సన్నాహక భేటీని జయప్రదం చేయాలి!
హుజూర్‌నగర్: రేపు (అక్టోబర్ 29) హుజూర్‌నగర్‌లో నిర్వహించనున్న ఉమ్మడి నల్గొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమీక్ష సమావేశాన్ని విజయవంతం చేయాలని మాజీ నియోజకవర్గ యూత్ బీ ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు, న్యాయవాది నగేష్ రాథోడ్ పిలుపునిచ్చారు.
ఉదయం 10:30 గంటలకు శ్రీలక్ష్మీ నరసింహ గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో జరిగే ఈ సమావేశానికి మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ తదితర ముఖ్య నాయకులు హాజరుకానున్నారు.
పట్టభద్రులందరూ ఓటు నమోదు చేసుకునేలా అవగాహన కల్పించడంతో పాటు, రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ విజయానికి అనుసరించాల్సిన కార్యాచరణపై నాయకులు దిశానిర్దేశం చేయనున్నారని తెలిపారు. పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, పట్టభద్ర ఓటర్లు అధిక సంఖ్యలో పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేయాలని నగేష్ రాథోడ్ కోరారు.




