Huzurnagar: బూరుగడ్డ రోడ్లకు ₹15 కోట్లు మంత్రి ఉత్తమ్‌కు కృతజ్ఞతలు
Huzurnagar: బూరుగడ్డ రహదారుల అభివృద్ధికి ₹15 కోట్లు మంజూరు చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సర్పంచ్ రాధనాగరాజు, మాజీ ఎంపీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పాలాభిషేకం.
Huzurnagar: బూరుగడ్డ రోడ్లకు ₹15 కోట్లు మంత్రి ఉత్తమ్‌కు కృతజ్ఞతలు
హుజూర్ నగర్: బూరుగడ్డ గ్రామ రహదారుల అభివృద్ధికి సుమారు 15 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసిన మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి చిత్రపటానికి గ్రామ సర్పంచ్ యరగాని రాధనాగరాజు అధ్యక్షతన గ్రామ కాంగ్రెస్ పార్టీ మరియు గ్రామ ప్రజల ఆధ్వర్యంలో కృతజ్ఞతలతో పాలాభిషేకం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపి గూడెపు శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ బూరుగడ్డమాచవరం గ్రామ అభివృద్ధికి ఇంత పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేయడం గ్రామ చరిత్రలో నూతన అధ్యాయం అన్నారు.
*బూరుగడ్డ నక్కగండి - బేతవోలు (5 కి.మీ) : రూ. 5.30 కోట్లు
*బూరుగడ్డ - హుజూర్ నగర్ BT రోడ్డు (4 కి.మీ) : రూ. 4.20 కోట్లు
*బూరుగడ్డ - కొత్త మంగాపురం - గౌండ్లగడ్డ (4.5 కి.మీ) : రూ. 3.225 కోట్లు
*మర్రిగూడెం - బూరుగడ్డ (1.5 కి.మీ) : రూ. 1.60 కోట్లు
ఈ మద్యకాలంలో 2కోట్లకు పైగా నిధులతో రైతాంగానికి ఉపయోగపడే విధంగా 4 బ్రిడ్జిల నిర్మాణం పూర్తి అయి ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉన్నాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గడ్డం నాగయ్య,దేవాలయ చైర్మన్ యరగాని బిక్షం, మాజీ ఛైర్మన్,గ్రామ అధ్యక్షులు, వార్డు మెంబర్లు, ధర్మకర్తలు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.




