Nalgonda: నల్లగొండ జిల్లాలో దారుణం.. కత్తితో పొడిచి భార్యను హత్య చేసిన భర్త!

Nalgonda: నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం శివన్నగూడెంలో దారుణం. భార్య రజిత (38)ను కత్తితో నరికి హత్య చేసిన భర్త ఇంద్రయ్య.

PARAMESH, NALGONDA & SURYAPET
Published on: 24 Oct 2026 12:35 PM IST
Nalgonda
X

Nalgonda: నల్లగొండ జిల్లాలో దారుణం.. కత్తితో పొడిచి భార్యను హత్య చేసిన భర్త!

Nalgonda: నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలో శనివారం ఉదయం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తాళి కట్టిన భార్యపైనే కక్ష పెంచుకున్న భర్త.. కత్తితో అతికిరాతకంగా దాడి చేసి హతమార్చాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

​పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని శివన్నగూడెం గ్రామానికి చెందిన సుంకరి రజిత (38)ను, ఆమె భర్త ఇంద్రయ్య (40) శనివారం ఉదయం విచక్షణారహితంగా కత్తితో దాడి చేసి హత్య చేశాడు. తీవ్ర గాయాలపాలైన రజిత రక్తపు మడుగులో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. గ్రామంలో జరిగిన ఈ దారుణాన్ని చూసి గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురై పోలీసులకు సమాచారం అందించారు.

​సమాచారం అందుకున్న వెంటనే మర్రిగూడ పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ హత్యకు గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. కుటుంబ కలహాలే కారణమా లేక మరేదైనా వివాదం ఉందా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి ముమ్మర దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు విచారణ అనంతరం వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

PARAMESH, NALGONDA & SURYAPET

PARAMESH, NALGONDA & SURYAPET