Suryapet: కార్తీక పౌర్ణమికి ముస్తాబైన పిల్లలమర్రి ఎరకేశ్వరాలయం!
Suryapet: సూర్యాపేటలోని చారిత్రక పిల్లలమర్రి ఎరకేశ్వరాలయం కార్తీక పౌర్ణమి వేడుకలకు రంగురంగుల విద్యుత్ దీపాలతో సుందరంగా ముస్తాబైంది.
Suryapet: కార్తీక పౌర్ణమికి ముస్తాబైన పిల్లలమర్రి ఎరకేశ్వరాలయం!
Suryapet: పవిత్ర కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని మున్సిపల్ పరిధిలోని చారిత్రకమైన కాకతీయులనాటి పిల్లలమర్రి ఎరకేశ్వరాలయం శోభాయమానంగా ముస్తాబైంది. వేడుకల కోసం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణాన్ని, గోపురాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో అత్యంత సుందరంగా అలంకరించారు.
సోమవారం రాత్రి పౌర్ణమి వెన్నెల వెలుగులో బంగారు వర్ణపు విద్యుత్ దీపాల కాంతులతో ఆలయ గోపురం ధగధగలాడుతూ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
కార్తీక పౌర్ణమి సందర్భంగా మంగళవారం తెల్లవారుజాము నుంచే స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, బిల్వార్చనలు, సామూహిక కార్తీక దీపారాధన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.




