Nalgonda: ఖాకీ చొక్కాలో మాతృత్వం.. చిన్నారిని లాలించిన హెడ్ కానిస్టేబుల్!
Nalgonda: నల్లగొండలో ఎస్సై పరీక్ష రాసేందుకు వచ్చిన తల్లికి తోడు లేకపోవడంతో డిండి హెడ్ కానిస్టేబుల్ షర్ఫ్ ఉద్దీన్ పసిబిడ్డను ఆడించి మానవత్వం చాటుకున్నారు.
Nalgonda: ఖాకీ చొక్కాలో మాతృత్వం.. చిన్నారిని లాలించిన హెడ్ కానిస్టేబుల్!
Nalgonda: ఎస్సై పరీక్ష రాసేందుకు వచ్చిన ఓ తల్లికి హెడ్ కానిస్టేబుల్ షర్ఫ్ ఉద్దీన్ అండగా నిలిచారు. పసిబిడ్డతో పరీక్షా కేంద్రానికి వచ్చిన ఆమెకు తోడుగా ఎవరూ లేకపోవడంతో ఆందోళనకు గురయ్యారు.
గమనించిన డిండి పోలీసు సిబ్బంది షర్ఫ్ ఉద్దీన్ ఆ చిన్నారిని ఆప్యాయంగా చేతుల్లోకి తీసుకుని ఆడించారు. తల్లి నిశ్చింతగా పరీక్ష రాసేలా సహకరించిన ఆయన మానవత్వాన్ని పలువురు అభినందించారు.




