Nalgonda: నాగార్జునసాగర్ కాలువలో ప్రమాదకర రసాయనాల కలకలం
Nalgonda: నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం చింతపల్లి వద్ద నాగార్జునసాగర్ లోలెవల్ కాలువలోకి గుర్తుతెలియని దుండగులు ప్రమాదకర రసాయనాలను పారబోయడం కలకలం రేపింది.
Nalgonda: నాగార్జునసాగర్ కాలువలో ప్రమాదకర రసాయనాల కలకలం
నల్లగొండ జిల్లా: నాగార్జునసాగర్ లోలెవల్ కాలువలో ప్రమాదకర రసాయనాలు కలకలం రేపాయి. నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం చింతపల్లి సమీపంలో గుర్తుతెలియని దుండగులు రసాయనాలను కాలువలోకి పారబోశారు.
గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. నీరు విషతుల్యమయ్యే ప్రమాదం ఉన్నందున, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.




