Nalgonda: నల్లగొండలో ఘనంగా పోలీస్ అమరవీరుల బైక్ ర్యాలీ!
Nalgonda: నల్లగొండలో పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా ఎస్పీ శరత్ చంద్ర పవార్ జెండా ఊపి ప్రారంభించిన భారీ బైక్ ర్యాలీ ఘనంగా నిర్వహించారు.
Nalgonda: నల్లగొండలో ఘనంగా పోలీస్ అమరవీరుల బైక్ ర్యాలీ!
Nalgonda: పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా జిల్లా పోలీస్ కార్యాలయం (DPO) నుంచి నల్లగొండ పట్టణంలో మంగళవారం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ చేపట్టిన ఈ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సమాజ రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడి అమరులైన పోలీసుల త్యాగాలు చిరస్మరణీయమని కొనియాడారు. వారి త్యాగనిరతి ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఈ ర్యాలీలో పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని అమరవీరులకు నివాళులర్పించారు.




