Suryapet: సూర్యాపేట పోలీస్ ఆఫీస్లో బతుకమ్మ సంబరాలు
Suryapet: సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎస్పీ కె. నరసింహ ఐపీఎస్ మహిళా సిబ్బందికి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
Suryapet: సూర్యాపేట పోలీస్ ఆఫీస్లో బతుకమ్మ సంబరాలు
సూర్యాపేట: సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. మహిళా పోలీసు సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కె. నరసింహ ఐపీఎస్ మహిళా పోలీసు సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు బతుకమ్మ, దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. పండుగలు మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలని, ఇలాంటి వేడుకలు సిబ్బంది మధ్య ఆత్మీయతను, ఐక్యతను పెంపొందిస్తాయని తెలిపారు. పోలీసు సిబ్బంది ఒక కుటుంబంలా కలిసిమెలిసి ఉండాలని, పరస్పర సహకారంతో విధులు నిర్వహించాలని ఆకాంక్షించారు. విధి నిర్వహణలో ఎదురయ్యే ఒత్తిడిని అధిగమించేందుకు ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు.
మహిళా సిబ్బంది రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి సంప్రదాయబద్ధంగా ఆటపాటలతో సంబరాలు జరుపుకున్నారు. చిన్నారులు, కుటుంబ సభ్యులతో పోలీస్ కార్యాలయ ప్రాంగణం పండుగ శోభను సంతరించుకుంది.
జిల్లా ప్రజలకు, పోలీసు సిబ్బందికి ఎస్పీ బతుకమ్మ, విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటివ్ అధికారి మంజు భార్గవి, డీఎస్పీ నరసింహ చారి, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు ప్రవీణ్ కుమార్, జానయ్య, మహిళా సూపరింటెండెంట్లు సబితా రాణి, శ్రీదేవి, మహిళా ఎస్ఐలు ఝాన్సీ రాణి, తేజస్విని, మహిళా సిబ్బంది అరుణ, కవిత, జ్యోతి, పోలీసు సంఘం అధ్యక్షుడు రమేష్, సెక్రెటరీ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.




