Nakrekal: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే వేముల వీరేశం!
Nakrekal: ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కుటుంబ సమేతంగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని నియోజకవర్గ ప్రజల క్షేమం కోసం ప్రార్థించారు.
Nakrekal: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే వేముల వీరేశం!
నల్గొండ: తిరుమల ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కుటుంబ సమేతంగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారి పూజా కార్యక్రమంలో పాల్గొని నకిరేకల్ నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని స్వామివారిని ప్రార్థించారు. అనంతరం ఆలయ అర్చకులు ఎమ్మెల్యే కి, వారి కుటుంబ సభ్యులకు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనాలు అందించారు.




