Nakrekal: నకిరేకల్ 9వ వార్డులో దుర్గామాతను దర్శించుకున్న ప్రభుత్వ విప్ వేముల వీరేశం!
Nakrekal: దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నకిరేకల్ 9వ వార్డులోని దుర్గామాత మండపంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రత్యేక పూజలు చేసి అన్నప్రసాద వితరణలో పాల్గొన్నారు.
Nakrekal: నకిరేకల్ 9వ వార్డులో దుర్గామాతను దర్శించుకున్న ప్రభుత్వ విప్ వేముల వీరేశం!
Nakrekal: నకిరేకల్ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని నకిరేకల్ పట్టణంలోని 9వ వార్డులో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపాన్ని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సందర్శించి అమ్మవారి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని నియోజకవర్గ ప్రజలంతా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, కోరుకున్నారు.
అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో , కాంగ్రెస్ పార్టీ నాయకులు, దుర్గామాత ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు, పాల్గొన్నారు.




