Suryapet: ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది!
Suryapet: తుంగతుర్తి నియోజకవర్గం మద్దిరాల మండల కేంద్రంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి ప్రారంభించారు.
Suryapet: ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది!
Suryapet: సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం మద్దిరాల మండల కేంద్రంలో, రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తుంగతుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి అన్నారు. బుధవారం మద్దిరాల మండల కేంద్రంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు దళారులకు ధాన్యం విక్రయించి మోసపోవద్దని సూచించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలని కోరారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాకు రూ.2,461తో పాటు అదనంగా రూ.500 బోనస్ అందజేస్తుందని తెలిపారు.
రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పచ్చిపాల వెంకన్న యాదవ్, గ్రామ సర్పంచ్ రాంపాక నాగరాజు, ఏపీఎం శ్రీనివాస్, ఏఈఓ ఆయేషా, మహిళా సంఘాల సభ్యులు బర్పటి రేణుక, ఎస్. విజితలక్ష్మి, విద్యలక్ష్మి, రైతులు తదితరులు పాల్గొన్నారు.




