Nalgonda: రంగవల్లి అక్క ప్రజల కోసం జీవితాన్ని త్యాగం చేసింది.. ఎమ్మెల్యే!
Nalgonda: నకిరేకల్‌లో నిర్వహించిన పీడీఎస్‌యూ మాజీ నాయకురాలు రంగవల్లి అక్క 27వ వర్ధంతి కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొని నివాళులర్పించారు.
Nalgonda: రంగవల్లి అక్క ప్రజల కోసం జీవితాన్ని త్యాగం చేసింది.. ఎమ్మెల్యే!
Nalgonda: నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో పీడీఎస్‌యూ మాజీ నాయకురాలు కామ్రేడ్ రంగవల్లి అక్క 27వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
పీడీఎస్‌యూ పూర్వ ఉద్యమ మిత్రుల ఆధ్వర్యంలో, చెరుకు సతీష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పీడీఎస్‌యూ మాజీ నాయకుడు, ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొని రంగవల్లి అక్క చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ.. శాస్త్రీయ విద్యావిధానం కోసం రంగవల్లి అక్క నిరంతరం పోరాటం చేశారని, ప్రజల కోసం తన జీవితాన్ని త్యాగం చేశారని కొనియాడారు. ఆమె మరణం పేద, పీడిత ప్రజలకు తీరని లోటని అన్నారు.
మనువాద, హిందుత్వ భావజాలానికి వ్యతిరేకంగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీడీఎస్‌యూ జెండా పట్టుకుని రంగవల్లి అక్క అనేక పోరాటాలు నిర్వహించారని గుర్తుచేశారు. సమసమాజ స్థాపనే లక్ష్యంగా ఉద్యమాలను నిర్మిస్తూ ప్రజల హక్కుల కోసం ఆమె చేసిన పోరాటం చిరస్మరణీయమని పేర్కొన్నారు.
రంగవల్లి అక్క త్యాగం, పోరాట పటిమ నేటి యువతకు స్ఫూర్తిదాయకమని వేముల వీరేశం పిలుపునిచ్చారు. రంగవల్లికి నివాళులర్పించిన వారిలో అరుణోదయ నాయకులు రాయి కృష్ణ రైతు కూలి సంఘం నాయకులు బొమ్మ కంటి కొమరయ్య పలస యాదగిరి,బీసీపీ నాయకులు గాజుల శ్రీను బోలికొండ లింగయ్య న్యూ డెమోక్రసీ నాయకులు గజ్జి రవి అంబటి చిరంజీవి, ప్రజాసంఘాల నాయకులు సాదుల నరసయ్య,కాశీరాం కప్పల వసంత దుర్గం సైదులు వివిధ రాజకీయ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.




