Nakrekal: నాణ్యతా ప్రమాణాలతో పాఠశాల నిర్మాణం వేగవంతం చేయాలి!
Nakrekal: నకిరేకల్ కడపర్తి రోడ్డులో రూ.200 కోట్లతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ పనులను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు.
Nakrekal: నాణ్యతా ప్రమాణాలతో పాఠశాల నిర్మాణం వేగవంతం చేయాలి!
Nakrekal: నకిరేకల్ పట్టణ సమీపంలోని కడపర్తి రోడ్డులో సుమారు రూ.200 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ పనులను ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పరిశీలించారు
ఈ సందర్భంగా నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించిన ఎమ్మెల్యే , సంబంధిత ఇంజనీర్లు, నిర్మాణ సంస్థ ప్రతినిధులతో మాట్లాడి పలు సూచనలు చేశారు. నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని, పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలను నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ పాఠశాల అందుబాటులోకి వస్తే నియోజకవర్గంలోని విద్యార్థులకు మెరుగైన విద్యావకాశాలు లభిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.




