Nalgonda: ప్రభుత్వ మద్దతు ధరకే ప్రతి గింజ కొనుగోలు.. విప్ వేముల వీరేశం!

Nalgonda: రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వ మద్దతు ధరకే కొనుగోలు చేస్తామని నకిరేకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశం స్పష్టం చేశారు.

PARAMESH, NALGONDA & SURYAPET
Published on: 5 Nov 2026 1:57 PM IST
Nalgonda
X

Nalgonda: ప్రభుత్వ మద్దతు ధరకే ప్రతి గింజ కొనుగోలు.. విప్ వేముల వీరేశం!

Nalgonda: రైతులు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వం మద్దతు ధరకే కొనుగోలు చేస్తుందని నకిరేకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశం స్పష్టం చేశారు. చిట్యాల మండలం చిన్న కాపర్తి, అరేగూడం, పెద్దకాపర్తి గ్రామాల్లో పిఎసిఎస్ (PACS) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన గురువారం వైభవంగా ప్రారంభించారు.

​ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..అన్నదాతలకు ఎలాంటి నష్టం జరగకుండా ప్రభుత్వమే నేరుగా ధాన్యం కొనుగోలు చేస్తుందన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా సకల సౌకర్యాలు కల్పించాలని, ప్రక్రియ వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు.​ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

PARAMESH, NALGONDA & SURYAPET

PARAMESH, NALGONDA & SURYAPET