Nakrekal: ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం: వేముల వీరేశం!
Nakrekal: నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి, సుంకనపల్లి గ్రామాల్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వ విప్ వేముల వీరేశం ప్రారంభించారు.
Nakrekal: ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం: వేముల వీరేశం!
నకిరేకల్: చిట్యాల మండలం, గుండ్రాంపెల్లి సుంకనపెల్లి గ్రామాల్లో PACS ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం మద్దతు ధరకే కొనుగోలు చేస్తుందని, కొనుగోలు కేంద్రంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




