Nalgonda: కొండమల్లేపల్లిలో ఘనంగా గోపాష్టమి గోమాత పూజ, హనుమాన్ చాలీసా!

Nalgonda: నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం కొలుముంతల పహాడ్‌లో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో గోపాష్టమి గోమాత పూజ, అభిషేకం, హనుమాన్ చాలీసా కార్యక్రమం ఘనంగా జరిగాయి.

BIJILI LINGIAIH, DEVARAKONDA
Published on: 18 Nov 2026 10:44 AM IST
Nalgonda
X

Nalgonda: కొండమల్లేపల్లిలో ఘనంగా గోపాష్టమి గోమాత పూజ, హనుమాన్ చాలీసా!

Nalgonda: విశ్వహిందూ పరిషత్ కొండమల్లేపల్లి ప్రఖండ ఆధ్వర్యంలో గోపాష్టమి గోపూజ మహోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు. కొండమల్లేపల్లి మండల పరిధిలోని కొలుముంతల పహాడ్ గ్రామంలో ఆంజనేయస్వామి మరియు శివాలయంలో అభిషేకం అలంకరణ ఘనంగా నిర్వహించారు.

గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రదక్షిణాలు చేశారు. అనంతరం హనుమాన్ చాలీసా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో గోమాత విశిష్టత గురించి గోవుకు పూజలు చేయడం వల్ల జరిగే లాభాలను పలువురు పెద్దలు ఉపన్యాసం చేయడం జరిగింది. గోవులో ప్రతిదీ ఉపయోగపడుతుందని, సేంద్రియ వ్యవసాయం చేయడానికి గో ఆధారిత వ్యవసాయం చాలా ముఖ్యమైనది అన్నారు.

గోమూత్రం, గోమయం వ్యాధుల నయం కోసం వాడతారని సూచించారు. గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని సూచించారు. శ్రీకృష్ణుడికి గోవుల మందరు అప్ప చెప్పిన రోజు కార్యక్రమం చాలా గొప్పదని అన్నారు.

ఈ కార్యక్రమంలో వింజమూరు చంద్రమౌళి, బొడ్డుపల్లి ఎల్లయ్య, ఏరుకొండ రాము,మాడ్గుల యాదగిరి, అలుగుపబెల్లి నాగార్జున రెడ్డి, సద్గురు సేవాలాల్ వేద పాఠశాల నిర్వాహకులు మూడావత్ లచ్చిరాం , జయ,బొడ్డుపల్లి శ్రీనివాస్, బొడ్డుపల్లి యాదగిరి,ఎలిజర్ల శ్రీను, యాదగిరి ,మల్లేష్, రామకృష్ణ, మాచర్ల వెంకటయ్య, కామిశెట్టి నరసింహ, నెల్లికంటి గోపి, కాసర్ల శంకర్ ,అఖిల్, ఆంజనేయులు, వెంకటమ్మ, విజయలక్ష్మి, ప్రమీల ,పద్మ, జానమ్మ, తదితరులు పాల్గొన్నారు.

BIJILI LINGIAIH, DEVARAKONDA

BIJILI LINGIAIH, DEVARAKONDA