Nalgonda: నల్లగొండలో గణనాథుడికి తీవ్ర అవమానం!
Nalgonda: నల్లగొండ బతుకమ్మ కుంట వద్ద గణేశుడి విగ్రహానికి తీవ్ర అవమానం నిమజ్జనం చేయకుండా రోడ్డుపైనే వదిలివేత, భక్తుల తీవ్ర ఆగ్రహం, అధికారుల చర్యలకు డిమాండ్.
Nalgonda: నల్లగొండలో గణనాథుడికి తీవ్ర అవమానం!
నల్గొండ: నల్గొండ పట్టణ శివారులో వినాయక విగ్రహానికి అవమానం. బతుకమ్మ కుంట వద్ద రోడ్డుపైనే వదిలేసిన వినాయక విగ్రహం. నిన్నటినుండి విగ్రహాన్ని నిమజ్జనం చేయకుండా రోడ్డుపైనే వదిలివేత. విగ్రహం దిక్కులేకుండా పడి ఉండటంపై భక్తులు, స్థానికుల ఆగ్రహం.
భక్తిభావంతో పూజించిన విగ్రహాన్ని నిర్లక్ష్యంగా వదిలేయడంపై మండిపాటు. విగ్రహాన్ని వెంటనే శాస్త్రోక్తంగా నిమజ్జనం చేయాలని భక్తుల డిమాండ్. నిర్లక్ష్యంగా వినాయక విగ్రహాని వదిలేసిన వారిపై చర్యలు తీసుకోవాలని భక్తుల డిమాండ్. మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించాలని కోరుతున్న స్థానికులు.




