Anneparthy: 12వ టీజీఎస్పీ బెటాలియన్‌లో ఘనంగా గాంధీ, శాస్త్రి జయంతి!

Anneparthy: అన్నెపర్తి 12వ టీజీఎస్పీ బెటాలియన్‌లో కమాండెంట్ బి.రామకృష్ణ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

Saleem, Nalgonda
Published on: 2 Oct 2026 12:57 PM IST
Anneparthy
X

Anneparthy: 12వ టీజీఎస్పీ బెటాలియన్‌లో ఘనంగా గాంధీ, శాస్త్రి జయంతి!

Anneparthy: అన్నెపర్తి 12వ టీజీఎస్పీ బెటాలియన్‌లో కమాండెంట్ బి.రామకృష్ణ ఆధ్వర్యంలో శుక్రవారం మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీజీ సత్యం, అహింసా మార్గాలు నేటి సమాజానికి ఆదర్శమని, శాస్త్రిజీ నిజాయితీ, దేశభక్తి ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని కమాండెంట్ పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు కమాండెంట్ నాగేశ్వరరావు, ఆర్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda