Tungaturthy: తిరుమలగిరిలో ఘనంగా మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి!
Tungaturthy: తుంగతుర్తి తిరుమలగిరిలోని క్యాంపు కార్యాలయంలో మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలను ఎమ్మెల్యే మందుల సామెల్ ఘనంగా నిర్వహించారు.
Tungaturthy: తిరుమలగిరిలో ఘనంగా మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి!
Tungaturthy: అహింస, సత్యాగ్రహ మార్గాల్లో భారత స్వాతంత్య్ర ఉద్యమాన్ని నడిపించిన మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి సేవలు చిరస్మరణీయమని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ అన్నారు. గాంధీ జయంతి, సందర్భంగా తిరుమలగిరిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం కోసం మహాత్మా గాంధీ చేసిన పోరాటం, దేశ రక్షణతో పాటు రైతుల సంక్షేమం కోసం లాల్ బహదూర్ శాస్త్రి అందించిన సేవలు దేశ ప్రజలు ఎప్పటికీ స్మరించుకోవాల్సినవని అన్నారు. అహింస, సత్యాగ్రహం, శాంతియుత మార్గాల ద్వారా బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా గాంధీజీ సాగించిన ఉద్యమం భారత చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించిందన్నారు.
అదేవిధంగా దేశం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో లాల్ బహదూర్ శాస్త్రి అందించిన నాయకత్వం స్ఫూర్తిదాయకమన్నారు. దేశ రక్షణలో సైనికుల పాత్రతో పాటు దేశానికి అన్నం పెట్టే రైతుల ప్రాధాన్యతను చాటుతూ ఆయన ఇచ్చిన “జై జవాన్ – జై కిసాన్” నినాదం నేటికీ స్ఫూర్తినిస్తోందన్నారు.
మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి ఆశయాలు, విలువలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని దేశ అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని ఎమ్మెల్యే మందుల సామెల్ పిలుపునిచ్చారు. అనంతరం గాంధీ, శాస్త్రి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.




