Nalgonda: నల్లగొండ జిల్లాలో డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య శిబిరం!

Nalgonda: నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు వద్ద డ్రైవర్ల కోసం ఉచిత కంటి వైద్య శిబిరం. ఎస్పీ శరత్ చంద్ర పవార్, డీఎస్పీ శివరాం రెడ్డి ప్రారంభం.

Saleem, Nalgonda
Published on: 7 Oct 2026 2:03 PM IST
Nalgonda
X

Nalgonda: నల్లగొండ జిల్లాలో డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య శిబిరం!

Nalgonda: రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ‘మిషన్ RRR’, ‘అరైవ్ అలైవ్’ క్యాంపెయిన్–2026లో భాగంగా నల్లగొండ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వెలిమినేడు వద్ద డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు.

ఈ కార్యక్రమాన్ని ఎస్పీ శరత్ చంద్ర పవార్, డీఎస్పీ శివరాం రెడ్డి ప్రారంభించారు. వైద్యులు డ్రైవర్లకు కంటి పరీక్షలు చేసి, దృష్టిలోపాలు ఉన్నవారికి ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేశారు.

అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, సెల్‌ఫోన్ వినియోగం వల్ల కలిగే ప్రమాదాలపై అవగాహన కల్పించారు. డ్రైవర్ల భద్రతకే పోలీస్ శాఖ మొదటి ప్రాధాన్యం ఇస్తుందని అధికారులు స్పష్టం చేశారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda