Munugode: మునుగోడులో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఉచిత కంటి వైద్య శిబిరాలు!
Munugode: నల్లగొండ జిల్లా మునుగోడులో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాలు. వేలాది మందికి పరీక్షలు, ఆపరేషన్లు మరియు కండ్లజోళ్ల పంపిణీ.
Munugode: మునుగోడులో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఉచిత కంటి వైద్య శిబిరాలు!
Munugode: మునుగోడు నియోజకవర్గంలో కంటి విప్లవం కొనసాగుతోంది నియోజకవర్గ వ్యాప్తంగా ఏ ఒక్కరు కూడా కంటి సమస్యలతో బాధపడొద్ధని, ప్రతి ఒక్కరికి కంటి సమస్య లేకుండా చేయించి నాణ్యమైన చూపును అందించాలనే ముందుచూపుతో తన మాతృమూర్తి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ పేరు మీద మునుగోడు నియోజకవర్గ ఉచిత కంటి వైద్య శిబిరాలకు శ్రీకారం చుట్టారు..ఇప్పటివరకు 16 ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహించి 12306 మందికి కంటి పరీక్షలు చేయించి 2673 మందికి కంటి ఆపరేషన్లు పూర్తిచేసి,,5522 మందికి కండ్లజోళ్ల పంపిణీ చేశారు.
మునుగోడు మండల ప్రజలకు మునుగోడు లో నిర్వహించిన మొదటి విడత ఉచిత కంటి వైద్య శిబిరంలో 216 మందికి, 2వ విడత ఉచిత కంటి వైద్య శిబిరంలో 108 మందికి, చండూరు మున్సిపాలిటీ ప్రజలకు మునుగోడు లో నిర్వహించిన 3వ విడత ఉచిత కంటి వైద్య శిబిరంలో 129 మందికి, నాంపల్లి మండలప్రజలకు నాంపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన 4వ, విడత ఉచిత కంటి వైద్య శిబిరంలో 229 మందికి, మర్రిగూడ మండల కేంద్రంలో నిర్వహించిన 5వ, విడత కంటి వైద్య శిబిరంలో 171 మందికి.
చూండురు మండల ప్రజలకు చండూరు మండలం బంగారి గడ్డలో నిర్వహించిన 6వ, విడత వైద్యశిబిరంలో 198 మందికి, ఘట్టుప్పల్ మండల కేంద్రంలో ఘట్టుప్పల్ మండల ప్రజలకు నిర్వహించిన 7వ విడత వైద్య శిబిరంలో 65 మందికి, నారాయణ్ పూర్ మండలంలో నిర్వహించిన 8 వ, విడత వైద్య శిబిరంలో 132 మందికి, చౌటుప్పల్ మున్నిపాలిటీలో నిర్వహించిన 9వ, విడత వైద్య శిబిరంలో 82 మందికి, చౌటుప్పల్ మండలంలో నిర్వహించిన 10వ, విడత వైద్య శిబిరంలో 160 మందికి, మునుగోడు లో మునుగోడు, ఘట్టుప్పల్ మండలాల ప్రజలకు నిర్వహించిన 11వ, విడత వైద్య శిబిరంలో 257 మందికి, మునుగోడు క్యాంపు కార్యాలయం ఆవరణలో చూండరు మున్సిపాలిటీ చండూరు మండల ప్రజలకు నిర్వహించిన 12 వ, విడత వైద్య శిబిరంలో 223 మందికి, మునుగోడు క్యాంపు కార్యాలయ ఆవరణలో నాంపల్లి మండల ప్రజలకు నిర్వహించిన 13 వ, వైద్య శిబిరంలో 228 మందికి, మరి గూడ మండల కేంద్రంలో మర్రిగూడ మండల ప్రజలకు నిర్వహించిన 14వ విడత వైద్య శిబిరంలో 127 మందికి, చౌటుప్పల్ లో చౌటుప్పల్ మండల, పట్టణ ప్రజలకు నిర్వహించిన 15 విడత వైద్య శిబిరంలో 165 మందికి, మునుగోడు లో నిర్వహించిన 16 వ, విడత వైద్య శిబిరంలో 183 మందికి కంటి ఆపరేషన్లను పూర్తి చేశారు.
మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా కంటి సమస్యతో బాధపడుతున్న ప్రతి తల్లి, ప్రతి తండ్రి కి పెద్దకొడుకుగా మారి కంటి శస్త్ర చికిత్సలు చేయిస్తున్నారు... రాబోయే రోజుల్లో నియోజకవర్గ వ్యాప్తంగా ఏ ఒక్కరు కూడా కంటి సమస్యతో బాధపడకుండా ఉండాలని ప్రణాళిక రూపొందించారు.. ఆ ప్రణాళికలో భాగంగానే 10 పదివేల మందికి కంటి శస్త్ర చికిత్సలు చేయించేలా టార్గెట్ పెట్టుకున్నారు..తన మాతృమూర్తి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో, ఫీనిక్స్ ఫౌండేషన్, శంకర కంటి ఆసుపత్రి సౌజన్యంతో ఈ ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు.




