Nalgonda: నార్కట్‌పల్లిలో భారీ పేలుడు ప్రమాదం.. నలుగురికి తీవ్ర గాయాలు!
Nalgonda: నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం గోపులయిపల్లిలోని ఎక్స్‌ప్లోజివ్స్ యూనిట్లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
Nalgonda: నార్కట్‌పల్లిలో భారీ పేలుడు ప్రమాదం.. నలుగురికి తీవ్ర గాయాలు!
Nalgonda: నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం గోపులయిపల్లిలోని గణేష్ ఆనంద్ ఎక్స్క్లూజివ్స్లో భారీ బ్లాస్టింగ్ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాద ధాటికి భవన భాగాలు చెల్లాచెదురుగా ఎగిరిపడ్డాయి. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడగా, వారిలో ముగ్గురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రమాదంలో గాయపడిన ముగ్గురిని మెరుగైన చికిత్స కోసం వెంటనే హైదరాబాద్ తరలించగా, మరొకరికి నార్కట్‌పల్లి కామినేని ఆసుపత్రిలో అత్యవసర చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో ముగ్గురు ఒడిశా రాష్ట్రానికి చెందిన కార్మికులు కాగా, మరొకరు యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అసలు ప్రమాదం ఎలా జరిగింది, పేలుడుకు గల కారణాలేంటి అనే అంశాలపై పోలీసులు కేసు నమోదు చేసుకుని ముమ్మర విచారణ జరుపుతున్నారు.




