Nalgonda: నల్గొండ ప్రభుత్వాసుపత్రిలో ఎంబీఆర్ఐ స్కాన్, అదనపు బెడ్లు ఏర్పాటు చేయాలి!

Nalgonda: నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంఆర్‌ఐ స్కానింగ్, 25 ఐసీయూ బెడ్లు, డయాలసిస్ పడకలు పెంచాలని, ఆసుపత్రి భవన నిర్మాణానికి రూ. 200 కోట్లు మంజూరు చేయాలని కంచర్ల భూపాల్ రెడ్డి డిమాండ్.

Saleem, Nalgonda
Published on: 7 Nov 2026 1:29 PM IST
Nalgonda
X

Nalgonda: నల్గొండ ప్రభుత్వాసుపత్రిలో ఎంబీఆర్ఐ స్కాన్, అదనపు బెడ్లు ఏర్పాటు చేయాలి!

Nalgonda: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు వెంటనే ఎంబీఆర్ఐ (MRI) స్కానింగ్ సెంటర్‌తో పాటు 25 ఐసీయూ (ICU) బెడ్లు, 15 డయాలసిస్ పడకలను అదనంగా పెంచాలని నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి డిమాండ్ చేశారు.

​శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... నిర్మాణంలో ఉన్న జిల్లా ఆసుపత్రి భవన పనులను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం తక్షణమే రూ. 200 కోట్లు మంజూరు చేసి, త్వరగా ప్రారంభించాలని కోరారు. ఆసుపత్రి పనుల్లో తీవ్ర అలసత్వం వహిస్తున్న ప్రస్తుత ఏజెన్సీ ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేసి, సమర్థవంతమైన నూతన ఏజెన్సీకి పనులు అప్పగించి ప్రజలకు ఉచిత వైద్యాన్ని అందుబాటులోకి తేలాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda