Arvapally: అర్వపల్లిలో స్వర్గీయ రాంరెడ్డి దామోదర్ రెడ్డి విగ్రహావిష్కరణ!

Arvapally: అర్వపల్లిలో మాజీ మంత్రి స్వర్గీయ రాంరెడ్డి దామోదర్ రెడ్డి విగ్రహావిష్కరణ కుమారుడు సర్వోత్తమ్ రెడ్డి ఆవిష్కరణ ఎమ్మెల్సీగా గెలిపించడమే నాన్నకు ఘన నివాళి అని వ్యాఖ్య.

Muragundla, Veeraiah, Tungathurthy
Published on: 1 Oct 2026 9:49 PM IST
Arvapally
X

Arvapally: అర్వపల్లిలో స్వర్గీయ రాంరెడ్డి దామోదర్ రెడ్డి విగ్రహావిష్కరణ!

అర్వపల్లి: తుంగతుర్తి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు యోగానంద చారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ విగ్రహాన్ని, అక్టోబర్ 1 తారీఖున రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు సర్వోత్తమ్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా వివిధ నాయకులు రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి పార్టీ కోసం , పార్టీ కార్యకర్తల కోసం పాటు పడ్డారని, అన్నారు.అనంతరం సర్వోత్తమ్ రెడ్డి మాట్లాడుతూ తన తండ్రి కాంగ్రెస్ పార్టీ కోసం పార్టీ కార్యకర్తల కోసం అహర్నిశలు శ్రమించారని.

ఆయన ఆశయ సాధన కోసం నడుస్తున్న నాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా నియమించినందుకు ధన్యవాదాలు తెలిపారు .ఆయన ఆశయ సాధన కోసం ఎల్లప్పుడూ, పార్టీ కోసం,పార్టీ కార్యకర్తల కోసం పాటుపడతానని అన్నారు రాబోయే నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రుల ఎన్నికల్లో తనను అసెంబ్లీ పంపియడమే రామ్ రెడ్డి దామోదర్ గారికి మీరిచ్చే బహుమానమని ఆయన అన్నారు.

దామోదర్ రెడ్డి విగ్రహ ప్రతిష్ఠకు సీనియర్ నాయకుల ముందడుగు తుంగతుర్తిలో గానీ, సూర్యాపేటలో గానీ ఈ ఏడాదిలో దామోదర్ రెడ్డి కాంశ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తాను భావించానన్నారు.అయితే గత ఏడాది నుంచి అనేక రాజకీయ ఒత్తిళ్లను ఎదుర్కొంటూ, వరుస ఎన్నికల్లో పాల్గొంటూ తన రాజకీయ ఆలోచనలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో సమయం గడిచిపోయిందని తెలిపారు.

తాను విగ్రహాన్ని ఏర్పాటు చేయలేకపోయాననే బాధ తనలో ఉండేదని, ఎవరైనా ముందుకు వచ్చి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందని భావించానన్నారు.అలాంటి సమయంలో సీనియర్ నాయకులు యోగానందాచారి తనకు ఫోన్ చేసి, తన అనుమతి తీసుకోకుండానే దామోదర్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారని చెప్పారు.

దామోదర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా అక్టోబర్ 1న విగ్రహాన్ని ఆవిష్కరించాలని నిర్ణయించుకున్నామని, కరపత్రాల్లో కూడా వ్యక్తిగత ప్రతిష్ఠకు కాకుండా ‘దామోదర్ రెడ్డి అభిమానులు’ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పారని వివరించారు.

వ్యక్తిగత ప్రతిష్ఠ కంటే దామోదర్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయడమే ముఖ్యమని భావించి సీనియర్ నాయకులు నర్సింగ్ సింగ్, సత్యం, రామిరెడ్డితో పాటు పలువురు సర్పంచులు ముందుకు రావడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. తనలో ఉన్న లోటును తీర్చినందుకు నాయకులకు చేతులు జోడించి కృతజ్ఞతలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. దామోదర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసే అవకాశం కల్పించినందుకు సంతోషంగా ఉందని తెలిపారు.

Muragundla, Veeraiah, Tungathurthy

Muragundla, Veeraiah, Tungathurthy