Suryapet: సూర్యాపేట సమీపంలో ఘోర ప్రమాదం ఇద్దరు వాకర్లు మృతి!

Suryapet: సూర్యాపేట రూరల్ మండలం బాలెంల స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. వేగంగా వచ్చిన డీసీఎం ఢీకొని వాకింగ్ చేస్తున్న ఇద్దరు మృతి, ఒకరికి తీవ్ర గాయాలు.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 16 Oct 2026 9:40 AM IST
Suryapet
X

Suryapet: సూర్యాపేట సమీపంలో ఘోర ప్రమాదం ఇద్దరు వాకర్లు మృతి!

Suryapet: సూర్యాపేట రూరల్ మండలం బాలెంల స్టేజ్ సమీపంలో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వాకింగ్ చేస్తున్న బాలెంల గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులను వేగంగా వచ్చిన డీసీఎం వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.

జనగాం నుండి సూర్యాపేట వైపు వస్తున్న డీసీఎం బాలెంల స్టేజ్ సమీపంలో జాగింగ్ చేస్తున్న గుర్రం సైదులు, ఆలకుంట్ల నాగరాజు, గొల్ల జానయ్య లను బలంగా ఢీకొట్టింది.

ఈ ఘటనలో గుర్రం సైదులు సంఘటన స్థలంలోనే మృతి చెందారు. తీవ్ర గాయాలతో రెండు కాళ్లు విరిగి, తీవ్ర రక్తస్రావం అయిన ఆలకుంట్ల నాగరాజు సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

గొల్ల జానయ్య తలకు బలమైన గాయాలు కావడంతో హైదరాబాద్ లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. క్షతగాత్రులను స్థానికులు వెంటనే ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA