Thirumalagiri: గిట్టుబాటు ధర కోసం తిరుమలగిరిలో రైతుల రాస్తారోకో

Thirumalagiri: తిరుమలగిరిలో వ్యాపారులు పంట ధరలు తగ్గించడంతో ఆగ్రహించిన రైతులు గిట్టుబాటు ధర కల్పించాలని రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు.

Muragundla, Veeraiah, Tungathurthy
Updated on: 26 Oct 2026 6:12 PM IST
Thirumalagiri
X

Thirumalagiri: గిట్టుబాటు ధర కోసం తిరుమలగిరిలో రైతుల రాస్తారోకో

సూర్యాపేట జిల్లా: సూర్యాపేట జిల్లా.. తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరిలో రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ రైతులు రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు.రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. మొన్నటి వరకు క్వింటా కు రూ.3300 నుంచి రూ.3600 వరకు ధర పలకగా, నేడు దళారులు రూ.2600 నుంచి రూ.2800 వరకు మాత్రమే ధర నిర్ణయించడంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఒక్కసారిగా ధరలు తగ్గించడంతో పెట్టుబడులు కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ధర 4000 నుండి 5వేల వరకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగడంతో రహదారిపై ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.సంబంధిత అధికారులు స్పందించి రైతులకు న్యాయమైన ధర కల్పించేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

Muragundla, Veeraiah, Tungathurthy

Muragundla, Veeraiah, Tungathurthy