Nalgonda: వెలిమినేడులో వడ్ల కొనుగోలు కేంద్రం వద్ద రైతుల ధర్నా.. రైతు వేదికకు తాళం!
Nalgonda: నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడులో వడ్లు కొనుగోలు చేయకపోవడంతో రైతులు ధర్నా నిర్వహించి, రైతు వేదికకు తాళం వేశారు.
Nalgonda: వెలిమినేడులో వడ్ల కొనుగోలు కేంద్రం వద్ద రైతుల ధర్నా.. రైతు వేదికకు తాళం!
Nalgonda: నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు వడ్ల కొనుగోలు కేంద్రంలో రైతులు ధర్నా నిర్వహించారు. వరి ధాన్యం కోసి కల్లాలలో పోసి నెల రోజులు గడుస్తున్నా వడ్లు కొనుగోలు చేయడం లేదని ఆందోళన నిర్వహించారు. వడ్లు కొనుగోలు చేసే వరకు రైతు వేదిక తీయవద్దని రైతు వేదికకు తాళం వేశారు.
ప్రైవేట్ దళారులు తమ మంచి రేటుకు తీసుకుంటున్నారని, వారికి అమ్మనీయడం లేదని, ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదని ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదని నిరసన తెలిపారు. వెంటనే ఒడ్లు గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయాలని వడ్ల కళ్ళల్లో కూర్చొని నిరసన వ్యక్తం చేశారు..




