Thirumalagiri: తిరుమలగిరి మార్కెట్ ముందు రైతుల రాస్తారోకో!
Thirumalagiri: సూర్యాపేట జిల్లా తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ ముందు ధాన్యం మద్దతు ధరను తగ్గించడాన్ని నిరసిస్తూ రైతులు రాస్తారోకో చేపట్టారు.
Thirumalagiri: తిరుమలగిరి మార్కెట్ ముందు రైతుల రాస్తారోకో!
Thirumalagiri: ధాన్యం మద్దతు ధరను ఒక్కసారిగా తగ్గించడాన్ని నిరసిస్తూ సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ ముందు రైతులు మంగళవారం ఆందోళనకు దిగారు. మొన్నటివరకు రూ.3,600 ఉన్న మద్దతు ధరను రూ.2,500కు తగ్గించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రహదారిపై రాస్తారోకో చేపట్టారు.
కనీసం రూ.4,000 మద్దతు ధర చెల్లించాలని రైతులు డిమాండ్ చేశారు. దళారులు సిండికేట్‌గా ఏర్పడి తమను నిలువునా ముంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ఆందోళనతో ప్రధాన రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది.




