Nalgonda: నల్లగొండ మండలం అన్నారెడ్డిగూడెంలో ఎండిన బోర్‌బావులు!

Nalgonda: నల్లగొండ మండలం అన్నారెడ్డి గూడెంలో ఎండిపోయిన బోర్ బావులు. సాగునీరు లేక పంట పొలాల్లో పశువులను మేపుతున్నామని రైతుల ఆవేదన వ్యక్తం చేశారు.

Saleem, Nalgonda
Published on: 4 Oct 2026 6:22 PM IST
Nalgonda
X

Nalgonda: నల్లగొండ మండలం అన్నారెడ్డిగూడెంలో ఎండిన బోర్‌బావులు!

Nalgonda: నల్లగొండ మండలం అన్నారెడ్డి గూడెం గ్రామంలో భూగర్భ జలాలు అడుగంటి బోర్ బావులు ఎండిపోవడంతో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. సాగునీరు లేక పంటలు ఎండిపోవడంతో గ్రామానికి చెందిన రైతు బత్తుల చంద్రశేఖర్ పంట పొలాల్లో పశువులను మేపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం వృధాగా పోతున్న వరద కాలువ నీటిని ఎస్ ఎల్ బి సి (SLBC) కాల్వ ద్వారా కనీసం పది రోజుల పాటు విడుదల చేసి, గ్రామంలోని చెరువులు, కుంటలను నింపాలని స్థానిక రైతులు అధికారులను వేడుకుంటున్నారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda