Nalgonda: ప్రమాదంలో గాయపడిన చిన్న అంజయ్యను పరామర్శించిన రవీంద్ర కుమార్!

Nalgonda: నల్గొండ జిల్లా దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్న అంజయ్యను పరామర్శించారు.

BIJILI LINGIAIH, DEVARAKONDA
Published on: 28 Nov 2026 1:28 PM IST
Nalgonda
X

Nalgonda: ప్రమాదంలో గాయపడిన చిన్న అంజయ్యను పరామర్శించిన రవీంద్ర కుమార్!

Nalgonda: చందంపేట మండలం తెల్దేవరపల్లి గ్రామానికి చెందిన మేకల చిన్న అంజయ్య ఇటీవల ట్రాక్టర్ ప్రమాదంలో గాయపడి హైదరాబాద్‌లోని ఆరుద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న దేవరకొండ మాజీ శాసనసభ్యులు, బీఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ గారు శనివారం ఆసుపత్రికి వెళ్లి చిన్న అంజయ్యను పరామర్శించారు.

ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రమావత్ రవీంద్ర కుమార్ గారు మాట్లాడుతూ చిన్న అంజయ్యకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. ఆయన త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ఇంటికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రమావత్ మోహన్ కృష్ణ, బొంగిరాల గణేష్ తదితరులు పాల్గొన్నారు.

BIJILI LINGIAIH, DEVARAKONDA

BIJILI LINGIAIH, DEVARAKONDA