Thipparthi: సాగునీటి కోసం మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆందోళన!

Thipparthi: తిప్పర్తి మండల గ్రామాలకు సాగునీరు విడుదల చేయాలని నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆందోళన చేపట్టారు.

Saleem, Nalgonda
Published on: 21 Nov 2026 2:18 PM IST
Thipparthi
X

Thipparthi: సాగునీటి కోసం మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆందోళన!

Thipparthi: ​తిప్పర్తి మండలంలోని గ్రామాలకు సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి స్థానిక ప్రజలతో కలిసి ఆందోళన చేపట్టారు. డీ-39, డీ-40 కాలువల వద్దకు చేరుకున్న ఆయన, రైతుల అవసరాల దృష్ట్యా వెంటనే నీటిని అందించాలని అధికారులను కోరారు.

రెండు రోజుల్లోగా నీటిని విడుదల చేయని పక్షంలో తామే స్వయంగా కాలువల ద్వారా నీటిని విడుదల చేస్తామని, అవసరమైతే తూములు పగలగొట్టడానికి కూడా వెనుకాడబోమని కంచర్ల భూపాల్ రెడ్డి హెచ్చరించినట్లు ఆందోళనకారులు తెలిపారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda