Nalgonda: సోమయ్య కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్!
Nalgonda: శాలిగౌరారం మండలం అంబారిపేటలో బిఆర్‌ఎస్ నాయకుడు సోమయ్య కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ పరామర్శించి రూ.25,000 ఆర్థిక సాయం అందజేశారు.
Nalgonda: సోమయ్య కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్!
Nalgonda: నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం అంబారిపేట గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు తోట సోమయ్య నివాసానికి తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిశోర్ కుమార్ వెళ్లారు. ఇటీవల స్వల్ప అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొంది ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న సోమయ్యను ఆయన పరామర్శించారు.
అలాగే ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న సోమయ్య కుమారుడు భానుప్రసాద్‌ను కూడా పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
పార్టీకి అండగా ఉండే కార్యకర్తల కుటుంబాలకు నిరంతరం తోడుగా ఉంటామని స్పష్టం చేస్తూ, ఆ కుటుంబానికి రూ. 25,000 ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




