Jallapalli: ప్రతి ఒక్కరూ రేణుక ఎల్లమ్మ అనుగ్రహం పొందాలి: రవీంద్ర కుమార్!

Jallapalli: దేవరకొండ మండలం జిల్లపల్లిలో నిర్వహించిన శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ ఆదివారం పాల్గొన్నారు.

BIJILI LINGIAIH, DEVARAKONDA
Published on: 29 Nov 2026 4:09 PM IST
Jallapalli
X

Jallapalli: ప్రతి ఒక్కరూ రేణుక ఎల్లమ్మ అనుగ్రహం పొందాలి: రవీంద్ర కుమార్!

Jallapalli: ప్రతి ఒక్కరూ రేణుక ఎల్లమ్మ తల్లి అనుగ్రహాన్ని పొందాలని దేవరకొండ మాజీ శాసనసభ్యులు, బీఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ ఆకాంక్షించారు.ఆదివారం దేవరకొండ మండలం జిల్లపల్లి గ్రామంలో నిర్వహించిన శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమానికి ఆయన హాజరై, అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా రమావత్ రవీంద్ర కుమార్ మాట్లాడుతూ.. దైవ చింతనతో ప్రతి ఒక్కరికీ మానసిక ప్రశాంతత, ఆత్మవిశ్వాసం లభిస్తాయని అన్నారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకోవాలని, భక్తి భావంతో ముందుకు సాగాలని సూచించారు. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు టీవీఎన్ రెడ్డి, నీల రవికుమార్, సంకు కొండల్ రెడ్డి, దీపా శైలేందర్ రెడ్డి, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

BIJILI LINGIAIH, DEVARAKONDA

BIJILI LINGIAIH, DEVARAKONDA