Suryapet: ప్రతి ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వెలుగులు నింపాలి!

Suryapet: సూర్యాపేటలో 'మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి' పోస్టర్‌ను ఆవిష్కరించిన కాంగ్రెస్ పట్టభద్రుల ఎమ్‌ఎల్‌సీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి. లబ్ధిదారుల జీవితాల్లో వెలుగులు నింపాలని పిలుపు.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 7 Nov 2026 1:46 PM IST
Suryapet
X

Suryapet: ప్రతి ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వెలుగులు నింపాలి!

Suryapet: మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి అనే నినాదంతో రూపొందించిన పోస్టర్ ను సూర్యాపేట పట్టణంలోని వైట్ హౌస్ లో నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల శాసనమండలి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు పోతు భాస్కర్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా సర్వోత్తమ్ రెడ్డి మాట్లాడుతూ, ఇన్నాళ్లూ గుడిసెల్లో, అద్దె ఇళ్లలో ఎన్నో కష్టాల మధ్య చీకట్లో బతికిన పేద కుటుంబాలకు నేడు సొంత ఇంట్లో దీపం వెలిగించుకునే అవకాశం రావడం ఎంతో సంతోషకరమన్నారు.

ఇందిరమ్మ ఇంట్లో వెలిగే తొలి దీపావళి దీపం కేవలం ఒక దీపం మాత్రమే కాదని, అది ఆ కుటుంబ ఆత్మగౌరవానికి ప్రతీకని, వారి జీవితాల్లోకి వచ్చిన కొత్త వెలుగుకు నిదర్శనమని పేర్కొన్నారు.

ఈ ఏడాది దీపావళి పండుగను ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో కలిసి వారి ఇళ్లలోనే జరుపుకోవాలని, వారి సంతోషంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. నాయకులు, ప్రజాప్రతినిధులు తమ పరిధిలోని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారితో కలిసి దీపాలు వెలిగించి పండుగ జరుపుకోవాలని కోరారు.

ప్రతి ఇంట్లో వెలుగు నిండాలి, ప్రతి ముఖంలో చిరునవ్వు విరియాలి, ప్రతి పేద కుటుంబంలో ఆనందం వెల్లివిరియాలి, ఇదే ప్రజా ప్రభుత్వ ఆకాంక్ష అని అన్నారు. ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో పీడీ జబ్బార్, వర్క్ ఇన్ స్పెక్టర్ అబ్దుల్లా, మండల పార్టీ అధ్యక్షులు కోతి గోపాల్ రెడ్డి, దారావత్ వీరన్న నాయక్, ముస్కు రామచంద్ర రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్ చిలుముల సునీల్ రెడ్డి, శ్రీ లింగమంతుల దేవస్థానం చైర్మన్ పోలెబోయిన నర్సయ్య యాదవ్, మాజీ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు బైరు వెంకన్న గౌడ్, శ్రీ దండు మైసమ్మ దేవస్థానం మాజీ చైర్మన్ తంగెళ్ల కరుణాకర్ రెడ్డి, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఉట్కూరి దివ్య, సర్పంచులు రేఖ రమణ సతీష్, ఒగ్గు జానకి వెంకన్న, పట్టణ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బొడ్డు సాయి, నాయకులు చత్రు నాయక్, నాగు నాయక్, కల్లూరి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA