Miryalaguda: మిర్యాలగూడ ఈఎస్ఐ డిస్పెన్సరీకి తాళాలు.. రోగుల తీవ్ర అవస్థలు!

Miryalaguda: నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఈఎస్ఐ డిస్పెన్సరీకి తరచూ తాళాలు పడుతుండటంతో వైద్య సేవలు అందక కార్మికులు, పేద రోగులు తీవ్ర తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

SHAIK VASIM, MIRYALAGUDA
Published on: 5 Nov 2026 1:06 PM IST
Miryalaguda
X

Miryalaguda: మిర్యాలగూడ ఈఎస్ఐ డిస్పెన్సరీకి తాళాలు.. రోగుల తీవ్ర అవస్థలు!

Miryalaguda: మిర్యాలగూడ పట్టణంలోని ఈఎస్ఐ డిస్పెన్సరీకి తాళాలు పడుతుండటంతో వైద్య సేవల కోసం వచ్చే రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పేద కార్మికులు, ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు వైద్య సేవలు అందించాల్సిన ఈఎస్ఐ డిస్పెన్సరీలో సరైన సమయంలో సేవలు అందకపోవడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది.

ప్రతిరోజూ సుమారు 200 నుంచి 300 మంది వరకు వైద్య సేవలు, మందుల కోసం ఈ కేంద్రానికి వస్తుంటారని స్థానికులు చెబుతున్నారు. అయితే డిస్పెన్సరీకి తాళాలు వేసి ఉండటంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చే రోగులు నిరాశతో వెనుదిరగాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గతంలోనూ ఇదే తరహా సమస్యలు తలెత్తినట్లు ఆరోపణలు ఉన్నాయి. వైద్య సేవల కోసం ఆశగా వచ్చే కార్మికులు, రోగులు గంటల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంటోందని చెబుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది.

SHAIK VASIM, MIRYALAGUDA

SHAIK VASIM, MIRYALAGUDA