Nalgonda: అన్ని డివిజన్ల సమగ్రాభివృద్ధే ధ్యేయం: మేయర్ చైతన్య

Nalgonda: నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్‌ పరిధిలోని అన్ని డివిజన్లను సమానంగా అభివృద్ధి చేయడమే లక్ష్యమని మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.

Saleem, Nalgonda
Published on: 31 Oct 2026 2:42 PM IST
Nalgonda
X

Nalgonda: అన్ని డివిజన్ల సమగ్రాభివృద్ధే ధ్యేయం: మేయర్ చైతన్య

నల్గొండ: నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్‌ పరిధిలోని అన్ని డివిజన్లనూ సమానంగా అభివృద్ధి చేయడమే తమ ప్రధాన ధ్యేయమని నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి తెలిపారు. శనివారం నిర్వహించిన సాధారణ మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి ఆమె అధ్యక్షత వహించి మాట్లాడారు.

​రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో ఇప్పటికే నల్గొండ నగరంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని మేయర్ పేర్కొన్నారు. డివిజన్లలో ఎలాంటి సమస్యలున్నా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని, వాటిని తక్షణమే పరిష్కరిస్తామని స్పష్టం చేశారు.

సమావేశంలో పలువురు కార్పొరేటర్లు తమ డివిజన్లలోని కాలనీ సమస్యలను మేయర్ దృష్టికి తీసుకురాగా.. ఆమె సానుకూలంగా స్పందిస్తూ సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda