Nalgonda: ఎప్కూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘డప్పు కొట్టి.. దండోరా’ పోస్టర్
Nalgonda: నల్లగొండలో ఈనెల 29న ముదిరాజ్‌ల సమస్యలపై నిర్వహించనున్న ‘డప్పు కొట్టి.. దండోరా’ సభ పోస్టర్‌ను జిల్లా కలెక్టర్, ఎస్పీలు ఆవిష్కరించారు.
Nalgonda: ఎప్కూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘డప్పు కొట్టి.. దండోరా’ పోస్టర్
Nalgonda: ఎప్కూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈనెల 29న నల్లగొండలోని పెద్దగడియారం సెంటర్‌లో ‘డప్పు కొట్టి.. దండోరా’ సభ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. రాష్ట్రంలో ముదిరాజ్ కమ్యూనిటీపై జరుగుతున్న అన్యాయాలను నిరసిస్తూ, బహుజన యుద్ధ నౌక డాక్టర్ ఎప్కూరి సామ్యూల్ నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.
మంగళవారం దీనికి సంబంధించిన పోస్టర్‌ను జిల్లా కలెక్టర్, ఎస్పీలు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ మేయర్, వివిధ సంఘాల నాయకులు, కాంగ్రెస్ సీనియర్ నేతలు, ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.




