Huzurnagar: బాణసంచా దుకాణాల్లో భద్రతా చర్యలు చేపట్టాలి: కొండ హరీష్ గౌడ్
Huzurnagar: దీపావళి వేళ హుజూర్‌నగర్‌లో బాణసంచా దుకాణాల్లో అగ్నిమాపక భద్రత పాటించాలని, అధిక ధరలను అరికట్టాలని అధికారులకు బీజేపీ పట్టణ అధ్యక్షుడు కొండ హరీష్ గౌడ్ వినతిపత్రం ఇచ్చారు.
Huzurnagar: బాణసంచా దుకాణాల్లో భద్రతా చర్యలు చేపట్టాలి: కొండ హరీష్ గౌడ్
హుజూర్‌నగర్: దీపావళి పండుగ సందర్భంగా పట్టణంలో ఏర్పాటు చేస్తున్న బాణసంచా దుకాణాల్లో భద్రతా నిబంధనలు కఠినంగా అమలు చేయాలని బీజేపీ పట్టణ అధ్యక్షుడు కొండ హరీష్ గౌడ్ కోరారు. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ సతీష్, ఫైర్ ఆఫీసర్ సుబ్బరామిరెడ్డి, తహసీల్దార్ కార్యాలయ అధికారులకు వినతిపత్రాలు అందజేశారు.
జనావాసాలకు దూరంగా సురక్షిత ప్రాంతాల్లోనే దుకాణాలు ఏర్పాటు చేయాలని, నాణ్యతలేని బాణసంచా విక్రయాలను అరికట్టాలని, అధిక ధరలకు విక్రయించే వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రతి దుకాణంలో అగ్నిమాపక పరికరాలు, ఇసుక, నీటి సదుపాయాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బెల్లంకొండ నరేష్ గౌడ్, కంటు నాగరాజు, గుండా గోపి, పైడిమర్రి విజయ్, కొప్పెర సాయిరాం, చిలక రాజు సైదులు తదితరులు పాల్గొన్నారు.




