Nalgonda: ఖరీఫ్ ధాన్యం సేకరణను విజయవంతం చేయాలి: కలెక్టర్ చంద్రశేఖర్

Nalgonda: నల్లగొండ జిల్లాలో ఖరీఫ్ ధాన్యం సేకరణను పకడ్బందీగా చేపట్టాలని, రవాణా లారీలకు జీపీఎస్ ట్రాకింగ్ తప్పనిసరి అని కలెక్టర్ చంద్రశేఖర్ స్పష్టం చేశారు.

Saleem, Nalgonda
Published on: 18 Sept 2026 6:46 PM IST
Nalgonda
X

Nalgonda: ఖరీఫ్ ధాన్యం సేకరణను విజయవంతం చేయాలి: కలెక్టర్ చంద్రశేఖర్

Nalgonda: సమిష్టి కృషితో 2026-27 ఖరీఫ్ ధాన్యం సేకరణను విజయవంతం చేయాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయాదిత్య భవన్ లో ధాన్యం సేకరణ అమలు శాఖల అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

​ఈ ఖరీఫ్ సీజన్‌లో ధాన్యం కొనుగోలు పూర్తిగా ప్రభుత్వ సంస్థల ద్వారానే జరుగుతుందని, గోదాముల నిర్వహణ, హమాలీల నియామకం, రవాణా బాధ్యతలను ప్రభుత్వ శాఖలే పర్యవేక్షిస్తాయని తెలిపారు.

అక్రమాలకు తావులేకుండా ధాన్యం రవాణా చేసే లారీలకు జీపీఎస్ (GPS) ట్రాకింగ్ ఏర్పాటు చేయనున్నట్లు, OPMS ఆన్‌లైన్‌తో అనుసంధానిస్తామని వెల్లడించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రవాణా వాహనాలను మార్చేందుకు వీలులేదని, సమస్యలు సృష్టిస్తే ట్రాన్స్‌పోర్ట్ లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda