Kondamallepally: ఎన్నో ఏళ్ల తాగునీటి కష్టాలకు విముక్తి.. పైప్‌లైన్ ద్వారా శాశ్వత పరిష్కారం
Kondamallepally: కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని 10వ వార్డులో ఎన్నో ఏళ్లుగా ఉన్న తాగునీటి సమస్యను సర్పంచ్ పసునూరి యుగంధర్ రెడ్డి పైప్‌లైన్ వేయించి శాశ్వతంగా పరిష్కరించారు.
Kondamallepally: ఎన్నో ఏళ్ల తాగునీటి కష్టాలకు విముక్తి.. పైప్‌లైన్ ద్వారా శాశ్వత పరిష్కారం
నల్గొండ జిల్లా: కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని పదో వార్డులో ఎన్నో సంవత్సరాలుగా నెలకొన్న తాగునీటి సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. కాలనీవాసులు ఎదుర్కొంటున్న తాగునీటి ఇబ్బందులను గుర్తించిన కొండమల్లేపల్లి సర్పంచ్ పసునూరి యుగంధర్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని పైప్‌లైన్ ద్వారా నీటి సరఫరా సమస్యను పరిష్కరించడంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఏళ్ల తరబడి తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్న తమకు సర్పంచ్ యుగంధర్ రెడ్డి చొరవతో నీటి సమస్య తీరడం పట్ల కాలనీవాసులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రజల అవసరాలను గుర్తించి, సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న సర్పంచ్ సేవలను వారు కొనియాడారు.
ఈ సమస్య పరిష్కారంలో పదో వార్డు సభ్యులు బిజిలి లింగం, గంట మల్లేష్ సైతం చొరవ చూపుతూ సర్పంచ్ దృష్టికి ప్రజల సమస్యను తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేశారు.
ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న తాగునీటి సమస్యకు పైప్‌లైన్ ద్వారా పరిష్కారం చూపిన సర్పంచ్ పసునూరి యుగంధర్ రెడ్డికి, సహకరించిన వార్డు సభ్యులు బిజిలి లింగం, గంట మల్లేష్‌కు కాలనీవాసులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ప్రజల కష్టమే తన కష్టంగా భావించి, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తున్న సర్పంచ్ యుగంధర్ రెడ్డి నాయకత్వంలో కొండమల్లేపల్లి మరింత అభివృద్ధి చెందాలని స్థానికులు ఆకాంక్షించారు.




