Huzurnagar: బ్యాంకు అధికారులతో హుజూర్‌నగర్ పోలీసుల ప్రత్యేక అవగాహన సమావేశం!

Huzurnagar: హుజూర్‌నగర్‌లో బ్యాంకు అధికారులతో డీఎస్పీ శ్రీనివాసరెడ్డి ప్రత్యేక సమావేశం. సైబర్ నేరాల నివారణ, సీసీ కెమెరాల పర్యవేక్షణ, వినియోగదారుల భద్రతపై కీలక సూచనలు.

DONTHAGANI RAJA RAMESH, HUZUR NAGAR
Published on: 16 Oct 2026 1:53 PM IST
Huzurnagar
X

Huzurnagar: బ్యాంకు అధికారులతో హుజూర్‌నగర్ పోలీసుల ప్రత్యేక అవగాహన సమావేశం!

Huzurnagar: బ్యాంకులకు వచ్చే వినియోగదారుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, సైబర్ నేరాల నియంత్రణతో పాటు బ్యాంకుల వద్ద అనుమానాస్పద వ్యక్తుల కదలికలను నిరంతరం గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని హుజూర్‌నగర్ పోలీసు అధికారులు సూచించారు. ఈ మేరకు హుజూర్‌నగర్ పోలీసుల ఆధ్వర్యంలో రూరల్ పరిధిలోని ఐదు మండలాల బ్యాంకు అధికారులతో ప్రత్యేక అవగాహన సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశానికి డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, సీఐ చరమంద రాజు, హుజూర్‌నగర్, గరిడేపల్లి, నేరేడుచర్ల, మఠంపల్లి, పాలకవీడు మండలాలకు చెందిన ఎస్‌ఐలు, ఆయా ప్రాంతాల్లోని వివిధ బ్యాంకుల అధికారులు, సిబ్బంది హాజరయ్యారు.

ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ బ్యాంకుల వద్ద భద్రతా ప్రమాణాలు, సైబర్ నేరాల నివారణ, ఖాతాదారుల సొమ్ముకు రక్షణ కల్పించడం వంటి అంశాలపై పోలీసు అధికారులు బ్యాంకు సిబ్బందికి అవగాహన కల్పించారు. సైబర్ నేరగాళ్లు కొత్త పద్ధతుల్లో ప్రజలను మోసం చేస్తున్న నేపథ్యంలో ఖాతాదారులకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలని సూచించారు. ఓటీపీలు, బ్యాంకు వివరాలు, వ్యక్తిగత సమాచారాన్ని అపరిచితులతో పంచుకోవద్దని వినియోగదారులకు తెలియజేయాలని పేర్కొన్నారు.

అదేవిధంగా బ్యాంకు పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తులు సంచరించినా, అనుమానాస్పద సంఘటనలు చోటుచేసుకున్న వెంటనే గుర్తించి పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. బ్యాంకుల్లో, ఏటీఎం కేంద్రాల్లో సీసీ కెమెరాలు సక్రమంగా పనిచేసేలా చూడటంతో పాటు, వాటి పర్యవేక్షణను నిరంతరం కొనసాగించాలని తెలిపారు. ఏటీఎం కేంద్రాల వద్ద తగిన భద్రతా ఏర్పాట్లు కల్పించడం, అవసరమైన చోట సెక్యూరిటీ గార్డులను నియమించడం, బ్యాంకుల్లోకి వచ్చే వినియోగదారులకు సురక్షితమైన వాతావరణం కల్పించడం వంటి చర్యలు చేపట్టాలని సూచించారు.

బ్యాంకుల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా, పోలీసు శాఖతో సమన్వయం చేసుకుంటూ ముందస్తు జాగ్రత్తలు పాటించాలని అధికారులు స్పష్టం చేశారు. బ్యాంకుల వద్ద భద్రతను మరింత బలోపేతం చేయడం ద్వారా సైబర్ మోసాలు, దొంగతనాలు, ఇతర నేరాలను అరికట్టి ప్రజల ఆర్థిక భద్రతకు భరోసా కల్పించవచ్చని పేర్కొన్నారు.

DONTHAGANI RAJA RAMESH, HUZUR NAGAR

DONTHAGANI RAJA RAMESH, HUZUR NAGAR