Nalgonda: నల్లగొండలో దారుణం: తండ్రిని గొడ్డలితో నరికి చంపిన కొడుకు
Nalgonda: నల్లగొండ హనుమాన్ నగర్‌లో మద్యం కోసం డబ్బులు ఇవ్వలేదని కన్నతండ్రి లింగయ్యను కొడుకు గణేష్ గొడ్డలితో నరికి దారుణంగా హతమార్చాడు; పోలీసులు కేసు నమోదు చేశారు.
Nalgonda: నల్లగొండలో దారుణం: తండ్రిని గొడ్డలితో నరికి చంపిన కొడుకు
Nalgonda: మద్యానికి బానిసైన ఓ కొడుకు గొడ్డలితో దాడి చేసి కన్నతండ్రిని దారుణంగా హత్య చేసిన సంఘటన నల్లగొండ వన్‌టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలోని హనుమాన్ నగర్‌లో శనివారం చోటుచేసుకుంది.
స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం... హనుమాన్ నగర్‌కు చెందిన గొర్ల కాపరి సురిగిల లింగయ్య (70)కు కుమారుడు గణేష్ (35) ఉన్నాడు. గణేష్ నిత్యం మద్యానికి బానిసై డబ్బుల కోసం తండ్రితో గొడవ పడుతుండేవాడు. శనివారం మధ్యాహ్నం కూడా మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వాలని తండ్రిని నిలదీశాడు. లింగయ్య నిరాకరించడంతో ఇద్దరి మధ్య తీవ్ర వివాదం చెలరేగింది.
ఆవేశానికి లోనైన గణేష్, ఇంట్లో గొర్రెల కోసం ఆకులు నరికేందుకు ఉపయోగించే గొడ్డలితో తండ్రిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్ర గాయాలైన లింగయ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న వన్‌టౌన్ ఎస్సై ముత్తయ్య సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.




