Suryapet: బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కఠిన చర్యలు: ఎస్పీ నరసింహ!
Suryapet: బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కఠిన చర్యలు సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ హెచ్చరిక వైన్ షాపుల వద్ద బోర్డులు తప్పనిసరి, పోలీసుల ప్రత్యేక నిఘా.
Suryapet: బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కఠిన చర్యలు: ఎస్పీ నరసింహ!
సూర్యాపేట: బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం నేరమని, అది అసాంఘిక చర్యగా పరిగణించబడుతుందని జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ హెచ్చరించారు. జిల్లా పరిధిలో రోడ్ల పక్కన, కల్వర్టుల వద్ద, పాఠశాలలు, ఆట స్థలాలు, మైదానాలు, పార్కులు, ప్రజలు సంచరించే ప్రాంతాల్లో మద్యం సేవించడం వల్ల ప్రజలకు అసౌకర్యం కలగడంతో పాటు శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని అన్నారు. ముఖ్యంగా మద్యం సేవించి గొడవలకు పాల్పడటం, అసభ్యకరంగా ప్రవర్తించడం, ఇతరులను ఇబ్బందులకు గురిచేయడం వంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు.
వైన్ షాపుల వద్ద బహిరంగంగా మద్యం సేవించకుండా చూడాల్సిన బాధ్యత యజమానులపై ఉందని, ప్రతి వైన్ షాప్ వద్ద "బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం నేరం" అనే హెచ్చరిక బోర్డును తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు.
పొలాల గట్లు, వ్యవసాయ భూములు, రహదారుల పక్కన మద్యం సేవించి ఖాళీ సీసాలను పొలాల్లో పడేయడం వల్ల రైతులు, వ్యవసాయ కూలీలు తీవ్రంగా గాయపడే ప్రమాదం ఉందని, ముఖ్యంగా యువత మద్యం సేవించి వాహనాలు నడపడం, గుంపులుగా చేరి ఇతరులకు ఇబ్బంది కలిగించడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని తెలిపారు.
ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై పోలీసు శాఖ నిఘా కొనసాగుతుందని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.




