Dindi: డిండి ప్రాజెక్టుపై కల్వకుంట్ల కవిత పవర్ పాయింట్ ప్రజెంటేషన్

Dindi: నల్గొండకు నీరందించేందుకు డిండి ప్రాజెక్టును సందర్శించిన తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. గోదావరి నీళ్ల తరలింపుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్.

BIJILI LINGIAIH, DEVARAKONDA
Published on: 7 Nov 2026 4:50 PM IST
Dindi
X

Dindi: డిండి ప్రాజెక్టుపై కల్వకుంట్ల కవిత పవర్ పాయింట్ ప్రజెంటేషన్

డిండి: తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత శనివారం డిండి ప్రాజెక్ట్ ను సందర్శించి డిండి ప్రాజెక్ట్ కు నీటి తరలింపు విషయంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని మరిచి ప్రతి ఒక్క వర్గానికి సంబంధించినటువంటి ప్రజల్ని కూడా మోసం చేస్తున్నదని, అదే విధంగా మరి ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు కూడా మొద్దు నిద్రపోతున్నదని తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు.

ఇప్పుడున్న గవర్నమెంటు మహబూబ్నగర్ కి నల్గొండ ప్రజలకు నీళ్ల పంచాయితీ తీసుకొఛ్చి ప్రాజెక్టు కట్టకుండా ఆలస్యం చేద్దామనుకుంటున్నారని, కానీ ఈ రెండు జిల్లాలు కూడా తెలంగాణకు ఇంపార్టెంట్ అని, రెండు జిల్లాల ప్రజలు కూడా బాగుండాలి కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా పంచాయతీ లేకుండా చూడాలన్నారు.

తెలంగాణ రక్షణ సేనకు స్పష్టమైన పాలసీ ఉంది కాబట్టి రెండు జిల్లాల ప్రజలు కూడా బాగుండాలి ఇక్కడికి రావడం జరిగిందన్నారు.

కృష్ణ గోదావరి ఈ రెండు నదులలో గోదావరి నదిలో నీళ్లున్నాయని, ఆ గోదావరి నది నీళ్లనే తీసుకొని వచ్చి నల్గొండ ప్రజలకు భవిష్యత్తు కల్పించాలని ఆనాడు పీవీ నరసింహారావు ప్రయత్నం చేశారని ఆన్నారు. గోదావరి నుండి మల్లన్న సాగర్ వ్యవస్థ తయారయ్యి ఉన్నదని ఆ వ్యవస్థను వాడుకోవాల్సిన అవసరం ఉన్నదని మూడున్నర లక్షల ఎకరాలకు మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా నీళ్లు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.

తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత కూడా చంద్రబాబునాయుడు ప్రాజెక్టులు కట్టారని, తర్వాత జగన్మోహన్ రెడ్డి తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మనం కృష్ణా నది మీద ప్రాజెక్టులు పూర్తి చేసుకోలేదని ముఖ్యమంత్రి ని విమర్శించారు. పెండింగ్ ప్రాజెక్టులపై మేము ఒక పరిష్కారం చూపడానికి ఇవ్వాల ఇక్కడికి వచ్చానని, అన్ని పార్టీలు వస్తారు చూస్తారు పోతారు కొన్ని పార్టీలయితే రారు చూడరు మాట్లాడరు కానీ తెలంగాణ రక్షణ సేన మాత్రం వస్తది చూస్తది సాధిస్తది పోరాటం చేస్తది పరిష్కారం కూడా చూపిస్తది అన్నారు.

నల్గొండ ప్రజలకు నీళ్లు రావాలి మరి ఇక్కడ నుంచి నీళ్లు వస్తాయా ఈ నార్లాపూర్ అని ఎక్కడైతే ఉందో దీని కిందనే కల్వకుర్తి ఉంటుంది సర్వే లేకుండా ఆలోచన లేకుండా ఏం డిసైడ్ చేయకుండా ముఖ్యమంత్రి15 రోజుల కింద ఏదుల ఫైనలైజ్ చేసినామని చెప్తున్నారని, రెండు టీఎంసీలు పాలమూరు రంగారెడ్డికి సంబంధించి వస్తాయో రాదో డౌటే దానికి అదనంగా ఇంకో పాయింట్ సిక్స్ ఇయర్స్ అని చెప్తున్నారంటే కేవలం నల్గొండ ప్రజల్ని మోసం చేయడమే ఉమ్మడి నల్గొండకు నీళ్లు తీసుకురాను అని చెప్పలేక ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారని, అదేవిధంగా శివన్నగూడెం ప్రజలకు ఇంకా సంపూర్ణంగా డబ్బులు ఇవ్వలేదు.. ఇబ్బంది అంతా ఉంది..

అయినప్పటికీ ఆ మల్లన్న సాగర్ నుండే మనకు నీళ్లు తీసుకుంటే ఆ గోదావరి నీళ్లు ఇక్కడికి వస్తే తప్ప నల్లగొండకు నీళ్లు వచ్చేటటువంటి ఆస్కారం లేదు.. మా ప్రపోసల్ ఒకటే ఉంది మల్లన్న సాగర్..బస్వాపూర్ నుండి నీళ్లు తేవాలనేది మాది మొదటి ప్రపోజల్... 110 కిలోమీటర్లు కాల్వ ద్వారా నీరు తీసుకొని డైరెక్ట్ గా శివన్న గూడెం కి కూడా తీసుకురావచ్చు..ఎందుకంటే హైట్ డిఫరెన్స్ ఉంది.. గోదావరి నీళ్లు మూడు డిఫరెంట్ అలైన్మెంట్స్ తో డైరెక్ట్ గా తీసుకొచ్చి శివన్న గూడెంలో తీసుకు రావచ్చు అన్నారు.

ఏదైతే ఒరిజినల్గా డిండి ఎత్తిపోతలల్లో మూడున్నర నాలుగు లక్షల ఎకరాలకు నీళ్లు వస్తాయి అని చెప్పి వాగ్దానం చేసిందో లేకపోతే గోదావరి నీళ్లు రాకపోతే సోర్స్ లేదు ఇప్పటివరకు కూడా అయ్యే పరిస్థితి లేదు ఎస్ఎల్పిసిని ఆగమాగం చేసి ఒక 8 మందిని పొట్టన పెట్టుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అది నత్త నడకన సాగుతుంది ఆనాడు కేసీఆర్ ఉన్నప్పుడు కూడా అందులో రెండు మెషిన్లు ఉన్నా వాటి మీద ఎక్కువ శ్రద్ధ పెట్టి పని చేయలేదని,

ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆ విషయంలో నేను కూడా క్షమాపణ చెప్తా ఉన్నా నేను కూడా అదే గవర్నమెంట్ లో కలిసిన కాబట్టి ఆ టైంలో ఇవ్వాల్సినంత శ్రద్ధ గాని పెట్టాల్సిన శ్రద్ధగాని ఆ టనల్ బోరింగ్ మెషిన్ మీద పెట్టి ఉంటే ఇప్పటి వరకు అదనంగా నీళ్లు వచ్ఛేవని కృష్ణ గోదావరి లాంటి రెండు జీవనదులు ఉన్నా కూడా నల్గొండ జిల్లా ఇంకా ఎండడం అన్నది కరెక్ట్ కాదు ఓవరాల్ గా ఫ్లోరైడ్ తోని బాధపడేటువంటి ప్రాంతం మునుగోడైన దేవరకొండకు గోదావరి నీళ్లు రావాలని కోరారు.

ఇక్కడ ఫ్లోరైడ్ కేవలం తాగే నీళ్లలోనే కాకుండా ఫ్లోరైడ్ భూమిలో కూడా ఉన్నదని ఆ భూమిలో ఉన్నటువంటి ఫ్లోరైడ్ పోవాలంటే 30 నుండి 40 సంవత్సరాలు ఉపరితల నీటితోని ఈ నేల ఈ ప్రాంతం తడవాల్సిన అవసరం ఉన్నదని, రెండు నెలల క్రితం కూడా ఇక్కడ మళ్ళీ ఫ్లోరైడ్ కేసు బయటపడిందన్నారు.

రెండు నెలల కింద ఆల్టర్నేట్ ప్రపోజల్ ఈ ప్రాజెక్టుకి చెప్పాలి అని అనేకమంది ఇంజనీర్ తో మాట్లాడిన తర్వాతనే ఈ ప్రపోసల్ తీసుకొని వచ్చి గోదావరి కృష్ణా నదులు అనుసంధానం మాత్రమే నల్గొండ జిల్లాకు మన ఫ్యూచర్ కి సొల్యూషన్ అని ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తా ఉన్నాం.

గోదావరి కావేరి అనుసంధానం అని ఆంధ్ర వాళ్ళు ఆల్రెడీ ప్రయత్నాలు మొదలు పెట్టిండ్రు ఆ గోదావరి కావేరి అనుసంధానం మన ఏరియాలో మన దగ్గర తుపాకుల గూడెంలో అనుసంధానం అయితేనే మన తెలంగాణకు లాభం ఉంటది ఇంత గోదావరిలో నీళ్లు మిగిలి ఉంటె మనమేంటి తెచ్చుకునే అవకాశం ఉంటుంది కానీ దానికి కూడా ముఖ్యమంత్రి పోలవరం దగ్గర కావాలని ఒప్పుకొని వస్తే మాత్రం చూస్తూ ఊరుకోమని, ఖచ్చితంగా మన భూభాగంలో తుపాకులగూడెంలోనే గోదావరి కావేరి అనుసంధానం కావాలని, అప్పుడు అయితేనే మన నల్గొండ బతుకుదాన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం టిఆర్ఎస్ పార్టీ నిద్ర ఈ రెండిటిని కూడా వదిలించాలంటే ఒక్కసారి షాప్ ఇచ్చినట్టుగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలిపించమని నేను ప్రజలందరిని కోరుతున్నాం.. ఇక్కడ మీకు అందరూ పెద్దపెద్ద నాయకులు ఉన్నారు. అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ సీనియర్ మంత్రులు ఉన్నారు.

ఇరిగేషన్ శాఖ మంత్రి ఉన్నారు..గోదావరి నీళ్లు తీసుకు వచ్చే విధంగా ఆలోచన చేయాలన్నారు. కరువు దృష్ట్యా 25 వేల రూపాయలు ఎకరానికి ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ ప్రాంతం బాగుండాలి అంటే నీళ్లు రావాలంటే కృష్ణా గోదావరి నది అనుసంధానమేదైతే సొల్యూషన్ వస్తుందని, గోదావరి నదిని ఆంధ్రలో కాకుండా తెలంగాణ నుంచి అనుసంధానం చేసుకోవాలని ముఖ్యమంత్రి వెంటనే ఇది సర్వేజెప్పించి గోదావరి నుండి దిండి ఎత్తిపోతలను పూర్తి చేయాలని, ఎస్ ఎల్ బి సి ని పూర్తి చేయాలని, నాగార్జునసాగర్ పరిధిలో ఏవైతే పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాటిని ఫినిష్ చేయాలి అదేవిధంగా నల్గొండ నకిరేకల్ ఈ ప్రాంతాలలో కూడా అనేక ప్రాజెక్టులు పెండింగ్ ఉన్నాయి వాటి మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని ఇరిగేషన్ మంత్రి గారిని కోరుతున్నాను అని అన్నారు.

BIJILI LINGIAIH, DEVARAKONDA

BIJILI LINGIAIH, DEVARAKONDA