Yerravaram: శ్రీ బాల ఉగ్రనరసింహస్వామి భక్తి గీతాల సీడీ ఆవిష్కరణ!
Yerravaram: ఎర్రవరం దూలగుట్ట శ్రీ బాల ఉగ్రనరసింహస్వామి వైభవాన్ని కీర్తిస్తూ ఆవుల వీరభద్రం రచించిన భక్తి గీతాల సీడీని సోమవారం హుజూర్‌నగర్‌లో ఆవిష్కరించారు.
Yerravaram: శ్రీ బాల ఉగ్రనరసింహస్వామి భక్తి గీతాల సీడీ ఆవిష్కరణ!
సూర్యాపేట జిల్లా: ఎర్రవరం గ్రామంలోని దూలగుట్టపై వెలసిన శ్రీ బాల ఉగ్రనరసింహస్వామి వారి వైభవాన్ని కీర్తిస్తూ రచయిత ఆవుల వీరభద్రం రచించిన భక్తి గీతాల సీడీని సోమవారం ఘనంగా ఆవిష్కరించారు.
గాయకుడు తంగేళ్ల ఆనంద్ బాబు ఆలపించిన “ధన ధన ధన ధన దరువులు వేయంగా.. ఘన ఘన ఘన ఘన గంటలు మ్రోగంగా..” అనే భక్తి గీతాలతో రూపొందించిన సీడీని స్థానిక శ్రీ కనకదుర్గమ్మ దేవాలయంలో శ్రీ అన్నమయ్య భజన మండలి వ్యవస్థాపక అధ్యక్షులు బాచిమంచి కొండయ్య, ప్రధాన గాయకులు చప్పిడి బిక్షం, కన్వీనర్ ఆకుల రాము చేతుల మీదుగా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా స్వామివారి మహిమలను భక్తి గీతాల రూపంలో ప్రజలకు చేరవేయడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గాయకుడు తంగేళ్ల ఆనంద్ బాబు బృందం సభ్యులు ఉప్పల వీరభద్రం, ఆకుల రజని, సత్యనారాయణ చారి తదితరులు పాల్గొన్నారు.




