Kondamallepally: కాంగ్రెస్ నాయకుడు పంది శ్రీను సేవలు చిరస్మరణీయం

Kondamallepally: కొండమల్లేపల్లి మండలం చింతకుంట్ల గ్రామంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు స్వర్గీయ పంది శ్రీను విగ్రహాన్ని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ ఆవిష్కరించారు.

BIJILI LINGIAIH, DEVARAKONDA
Published on: 16 Nov 2026 4:33 PM IST
Kondamallepally
X

Kondamallepally: కాంగ్రెస్ నాయకుడు పంది శ్రీను సేవలు చిరస్మరణీయం

కొండమల్లేపల్లి: కొండమల్లేపల్లి మండలం చింతకుంట్ల గ్రామ మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు స్వర్గీయ పంది శ్రీను కాంగ్రెస్ పార్టీకి, ప్రజలకు అందించిన సేవలు చిరస్మరణీయమని దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలునాయక్ అన్నారు.

సోమవారం కొండమల్లేపల్లి మండలం చింతకుంట్ల గ్రామంలో స్వర్గీయ పంది శ్రీను మరణించి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన ఆయన విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పంది శ్రీను విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలునాయక్ మాట్లాడుతూ.. పంది శ్రీను గ్రామ సర్పంచ్‌గా పనిచేసిన సమయంలో గ్రామ అభివృద్ధికి విశేష కృషి చేశారని, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేసిన నాయకుడని కొనియాడారు. ప్రజలతో మమేకమై, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేసిన ఆయన సేవలు ఎప్పటికీ మరువలేనివని అన్నారు. పదవులు ఉన్నా లేకపోయినా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ప్రజల కోసం పనిచేసిన నాయకుడిగా పంది శ్రీను అందరికీ ఆదర్శంగా నిలిచారని గుర్తుచేశారు.

పంది శ్రీను భౌతికంగా మన మధ్య లేకపోయినా ప్రజలకు, కాంగ్రెస్ పార్టీకి ఆయన చేసిన సేవలు, ఆయనతో ఉన్న అనుబంధం ఎప్పటికీ ప్రజల హృదయాల్లో నిలిచిపోతాయని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను, ప్రజాసేవా స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పంది శ్రీను కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో నల్లగొండ పార్లమెంట్ కోఆర్డినేటర్ ఎం.ఏ. సిరాజ్ ఖాన్, నాయిని మాధవరెడ్డి, దూదిపాల శ్రీధర్ రెడ్డి, దూదిపాల వేణుధర్ రెడ్డి, ఊట్కూరి వేమన్ రెడ్డి, మేకల రాజేందర్ రెడ్డి, మేకల శ్రీనివాస్ యాదవ్, తేరా సత్యం రెడ్డి, తిప్పర్తి రుక్మారెడ్డి, పసునూరి యుగేందర్ రెడ్డి, రామవత్ రవి నాయక్, ఎర్ర కృష్ణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మార్పీఎస్ నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

BIJILI LINGIAIH, DEVARAKONDA

BIJILI LINGIAIH, DEVARAKONDA